Breaking News

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్...

ట్రంప్ మరో ఆసక్తికర ఆఫర్‌తో ముందుకొచ్చారు.అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికా విడిచిపెట్టి తమ దేశాలకు వెళ్లాలనుకునే వారికి మా ప్రభుత్వం సహాయం చేస్తుంది. విమాన టికెట్ల ఖర్చులతోపాటు కొంత డబ్బును కూడా అందిస్తాం,” అని తెలిపారు.


Published on: 16 Apr 2025 14:47  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత వలసల విషయంలో మరింత దూకుడుప్రదర్శిస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది.ఇటీవలి కాలంలో భారతదేశంతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన వందల మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రత్యేక విమానాల్లో వెనక్కి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు మరో ఆసక్తికర ఆఫర్‌తో ముందుకొచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ – “చట్టబద్ధంగా దేశంలో నివసించకపోతే, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందే. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, స్వచ్ఛందంగా అమెరికా విడిచిపెట్టి తమ దేశాలకు వెళ్లాలనుకునే వారికి మా ప్రభుత్వం సహాయం చేస్తుంది. విమాన టికెట్ల ఖర్చులతోపాటు కొంత డబ్బును కూడా అందిస్తాం,” అని తెలిపారు.అంతేకాదు, “తాము పంపినవారిలో నిజంగా మంచివారు ఉంటే, చట్టబద్ధంగా తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పిస్తాం. కానీ, ప్రస్తుతం ప్రాధాన్యత – దేశాన్ని అక్రమంగా వదిలిపెట్టడమే,” అని స్పష్టం చేశారు.

ట్రంప్ తాజా ప్రకటన వలసదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అక్రమ వలసలను నియంత్రించేందుకు ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానం కొన్ని వర్గాల్లో ప్రశంసలు పొందుతున్నప్పటికీ, మరికొన్ని వర్గాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది.

Follow us on , &

ఇవీ చదవండి