Breaking News

అప్రమత్తంగా ఉండాలని అన్ని జట్ల యాజమాన్యాలకు బీసీసీఐ లేఖ.

ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై బీసీసీఐ అనుమానంతో ఉంది. అతడు మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని జట్ల యాజమాన్యాలకు బోర్డు లేఖ రాసింది.


Published on: 17 Apr 2025 11:53  IST

ఐపీఎల్‌:ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు క్రికెట్‌ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. కానీ, లీగ్‌ జోరుగా కొనసాగుతున్న వేళ, బీసీసీఐ నుంచి వచ్చిన హెచ్చరిక కలకలం రేపుతోంది. ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ముప్పు ఉందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.

జాతీయ మీడియా కథనం ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై బీసీసీఐ అనుమానంతో ఉంది. అతడు మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని జట్ల యాజమాన్యాలకు బోర్డు లేఖ రాసింది. క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక జారీ అయింది.

బుకీలతో సంబంధాలున్న ఈ వ్యక్తి, గతంలోనూ బెట్టింగ్‌ కేసుల్లో ఉన్నట్లు బీసీసీఐకి చెందిన అవినీతి వ్యతిరేక విభాగం (ACSU) గుర్తించింది. ప్రస్తుతం ఐపీఎల్‌ జట్లు బస చేస్తున్న హోటళ్ల చుట్టూ, మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియాల్లో అతడు సంచరిస్తున్నాడని సమాచారం.

సోషల్‌ మీడియా వల: ఈ వ్యాపారవేత్త సోషల్‌ మీడియా ద్వారా ఆటగాళ్లతో పరిచయం అయ్యే అవకాశం ఉందని, ఎవరైనా అతడి సంప్రదింపులకు గురై ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని బీసీసీఐ కోరింది. ముఖ్యంగా యువ క్రికెటర్లు బుకీల వలలో పడకుండా జాగ్రత్త పడాలని, వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికింది.

గత సంఘటనలు గుర్తు: ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ ఆరోపణలు కొత్తవి కావు. 2013లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు శ్రీశాంత్‌, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌ అరెస్టయ్యారు. అలాగే, చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ యజమాని మేయప్పన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని రాజ్‌కుంద్రాపై నిషేధం విధించబడింది. అప్పటి తర్వాత బీసీసీఐ అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసింది.

గిఫ్ట్‌లు, పార్టీలు, పరిచయాలు: ఈ వ్యక్తి ఐపీఎల్‌ జట్లకు చెందిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖరీదైన బహుమతులు ఇవ్వడం, హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేయడం, జట్టు సిబ్బంది, కుటుంబ సభ్యులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా తన వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి