Breaking News

ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మళ్లీ శ్రీకారం చుట్టనున్న ప్రధాని నరేంద్ర మోడీ . ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని చేశారు


Published on: 17 Apr 2025 16:36  IST

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మళ్లీ శ్రీకారం చుడుతున్నారు. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుక కోసం ప్రభుత్వం సచివాలయం వెనక ఉన్న బహిరంగ ప్రాంగణాన్ని వేదికగా ఎంపిక చేసింది.

ఈ కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు భారీగా హాజరవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతా పరిరక్షణకు ఎస్పీజీ బృందం బాధ్యతలు స్వీకరించింది.

ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారనే అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్‌ — సంభావ్య రవాణా మార్గాలను గుర్తించి, రద్దీ లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 9 ప్రధాన రహదారులు ఈ కార్యక్రమానికి రాకపోకల కోసం వాడనున్నట్లు తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి