Breaking News

శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ


Published on: 25 Jul 2025 11:02  IST

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారని హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో, ఈ కేసు ఇప్పుడు సీబీఐ కోర్టులో విచారణకు వెళ్లనుంది. సీబీఐ, ప్రతివాదుల వాదనలను హైకోర్టు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి