Breaking News

గురువారం  అర్థరాత్రి నుంచి పాక్ సైనికులు భారత భూభాగం మీదుగా కాల్పులకు పాల్పడింది.

పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భద్రతా స్థావరాలపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించింది.


Published on: 25 Apr 2025 12:13  IST

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదంపై కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో, సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.అయితే, పాకిస్థాన్ కూడా తక్షణమే స్పందిస్తూ, భారత్‌తో గతంలో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సందర్భంలో శుక్రవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వద్ద పాక్ భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత భూభాగం మీదుగా కాల్పులకు పాల్పడింది.

గురువారం  అర్థరాత్రి నుంచి పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భద్రతా స్థావరాలపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ చర్యలకు భారత సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. తక్షణమే అప్రమత్తమైన జవాన్లు అదే స్థాయిలో ఎదురు కాల్పులు జరిపారు.ఈ దాడులతో ఎల్వోసీ ప్రాంతం హై అలర్ట్‌కి చేరింది. రెండు దేశాలు సరిహద్దుల్లో తమ బలగాలను పెంచడంతో ఇరు దేశాలు మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.“పాకిస్థాన్ సైన్యం చిన్న ఆయుధాలతో దాడికి పాల్పడగా, మన దళాలు ధైర్యంగా ప్రతిఘటించాయి. భారత వైపున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు,” అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు.

ఈ దాడికి భారత సైన్యం సుడిగాలి వేగంతో ప్రతిస్పందించింది. సముచితంగా ఎదురు కాల్పులు జరిపి పాక్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి