Breaking News

గుడ్ న్యూస్.. లబ్ధిదారులే ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో ఫొటోలు అప్లోడ్ చేయొచ్చు

గుడ్ న్యూస్.. లబ్ధిదారులే ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో ఫొటోలు అప్లోడ్ చేయొచ్చు


Published on: 05 Sep 2025 11:24  IST

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా, వేగంగా అమలు చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పురోగతిని స్వయంగా ఫొటోలు అప్‌లోడ్ చేస్తే, సంబంధిత బిల్లుల విడుదల సులభంగా జరుగుతుంది. ఈ విషయాన్ని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ.పీ. గౌతమ్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ప్రతి లబ్ధిదారుడు తన ఇంటి పనుల స్థితిని ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. బిల్లు ఏ దశలో ఉందో, ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉందో, ఎప్పుడు ఎంత మొత్తం వచ్చిందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇది అవినీతి అరికట్టడంలోనూ, జాప్యాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది’’ అని గౌతమ్ వివరించారు.

యాప్ వాడకం ఇలా ఉంటుంది

  1. ఇన్‌స్టాలేషన్ – ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి, ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

  2. డాష్‌బోర్డ్ – లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారు పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి.

  3. ఫొటో అప్లోడ్ ఆప్షన్లు – "గ్రౌండింగ్, బేస్‌మెంట్, వాలింగ్, స్లాబ్, నిర్మాణం" వంటి దశల వారీగా ఫొటోలు అప్లోడ్ చేసే ఆప్షన్లు ఉంటాయి.

  4. జియోట్యాగ్ ఫొటోలు – ఇంటి వద్ద లబ్ధిదారుతో పాటు ముందు, పక్క, పై నుంచి (టాప్ యాంగిల్)లో ఫొటోలు తీయాలి. ఫొటోలు తప్పనిసరిగా నిర్మాణ స్థలం దగ్గర నుంచే తీయాలి.

  5. సబ్మిట్ ప్రాసెస్ – ఫొటోలు తీసి, యాప్‌లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

బిల్లుల విడుదల విధానం

లబ్ధిదారు అప్‌లోడ్ చేసిన ఫొటోలు, వివరాలను విలేజ్ సెక్రటరీలు, ఎంపీడీవోలు, ఇంజనీర్లు పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉన్నప్పుడు మాత్రమే బిల్లులు విడుదల అవుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి