Breaking News

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత..


Published on: 08 Sep 2025 16:14  IST

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యువత ప్రభుత్వంపైకి తిరుగుబాటు చేసింది. పార్లమెంట్ మెయిన్ గేట్ బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రవేశ ద్వారానికి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా యువత వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రబ్బరు బుల్లెట్లతో వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది చనిపోగా.. దాదాపు 100 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి