Breaking News

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..


Published on: 21 Oct 2025 14:43  IST

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై వెంటనే చర్యలు ఉపక్రమించారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో దీనిపై ఫోన్‌లో చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి