Breaking News

గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి


Published on: 23 Oct 2025 17:28  IST

తెలంగాణ గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రూపు-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్టు తనకు నిరుద్యోగులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి