Breaking News

జీవితకాల ట్రస్టీగా మెహ్లీ.. తిరిగి నియమించేందుకు ప్రతిపాదన.. టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం

జీవితకాల ట్రస్టీగా మెహ్లీ.. తిరిగి నియమించేందుకు ప్రతిపాదన.. టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం


Published on: 24 Oct 2025 15:57  IST

టాటా ట్రస్ట్స్ తమ ప్రధాన సేవా సంస్థల్లో ఒకటైన సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి జంషెట్‌జీ టాటా నవ్సారి చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్లకు మేహ్లీ మిస్త్రీని మళ్లీ ట్రస్టీగా నియమించాలనే ప్రతిపాదనను సర్క్యులేట్ చేసింది. ఈ నియామకం ఆమోదం పొందితే, మిస్త్రీ జీవితకాల ట్రస్టీగా కొనసాగే అవకాశం ఉంది.

రతన్ టాటాకు సన్నిహితుడైన మిస్త్రీ 2022లో టాటా ట్రస్ట్స్‌లో చేరగా, ఆయన మూడేళ్ల పదవీకాలం ఈ నెల 28న ముగియనుంది. తాజాగా టాటా ట్రస్ట్స్ వేణు శ్రీనివాసన్‌ను కూడా జీవితకాల ట్రస్టీగా పునర్నియమించడంతో, సంస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

156 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా సన్స్‌ గ్రూప్‌లో 30 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలతో సహా సుమారు 400 సంస్థలు ఉన్నాయి. ఇటీవల ట్రస్టుల్లో ఉన్న విభేదాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని సమన్వయ చర్చలు జరిపినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి