Breaking News

ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయానికి సిద్ధం

ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయానికి సిద్ధం


Published on: 28 Oct 2025 10:36  IST

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు క్యాబినెట్‌ ఉపసంఘంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ సబ్‌ డివిజన్ల మార్పులపై చర్చ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మొంథా తుఫాన్‌ పరిస్థితులపై అధికారులతో మరో సమీక్ష జరగనుంది.

జిల్లాల పునర్విభజన కోసం గతంలో ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ప్రజల నుంచి 200కు పైగా అభ్యర్థనలు, ప్రతిపాదనలు అందుకుంది. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల అభిప్రాయాలను కూడా పరిశీలించిన కమిటీ నివేదికలను సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.

ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలు 32 జిల్లాలుగా మారే అవకాశం ఉంది. ఈరోజు సమావేశంలో ఏ నిర్ణయం వస్తుందో అనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి