Breaking News

ఓట్ల కోసం ప్రధాని భరతనాట్యం చేయమన్నా చేస్తారు


Published on: 29 Oct 2025 18:28  IST

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కూటముల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు పోటాపోటీగా దూషణలకు దిగుతున్నారు. తాజాగా దర్భంగా లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్‌ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్‌ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి