Breaking News

జంట జ‌లాశ‌యాల‌కు భారీగా వ‌ర‌ద‌..


Published on: 29 Oct 2025 18:40  IST

హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్, ఉస్మాన్ సాగ‌ర్‌కు వ‌ర‌ద భారీగా వ‌చ్చి చేరుకుంటుంది. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌ల మండ‌లి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.ఉస్మాన్ సాగ‌ర్ నిండు కుండ‌లా మార‌డంతో.. ప్రాజెక్టు 10 గేట్ల‌ను రెండు అడుగుల మేర‌ ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఉస్మాన్ సాగ‌ర్ నుంచి మూసీలోకి 2,630 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి