Breaking News

జగద్గిరిగుట్టలో పట్టపగలు నడి రోడ్ పైన యువకుడి హత్య

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నవంబర్ 5, 2025న పట్టపగలు జరిగిన కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.


Published on: 06 Nov 2025 10:13  IST

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నవంబర్ 5, 2025న పట్టపగలు జరిగిన కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద అందరూ చూస్తుండగానే రోషన్ సింగ్ (26) అనే యువకుడిపై (రౌడీషీటర్) బాలేశ్వర్ రెడ్డి అనే మరో రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి కత్తితో దారుణంగా దాడి చేశాడు.ప్రాథమిక విచారణలో ఆర్థిక వివాదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు.తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్‌ను స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన నిందితుడు బాలేశ్వర్ రెడ్డి మరియు అతని సహచరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను పట్టుకున్నారు.నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి