Breaking News

వేమూరి ట్రావెల్స్ యజమాని  వినోద్ అరెస్టు

కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.


Published on: 07 Nov 2025 14:21  IST

కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న 'వి కావేరి' ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో రోడ్డుపై పడి ఉన్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను ఇప్పటికే A1 నిందితుడిగా అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా యజమాని వేమూరి వినోద్‌ను A2 నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అనంతరం వినోద్ కుమార్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు.ఫిట్‌నెస్ లేని బస్సును నడపడం, సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చడం వంటి నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి