Breaking News

ట్రంప్‌తో విభేదాల తర్వాత.. తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లిన మస్క్‌

ట్రంప్‌తో విభేదాల తర్వాత.. తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లిన మస్క్‌


Published on: 19 Nov 2025 17:30  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఒక ముఖ్యమైన బిల్లుపై అభిప్రాయాలు కలవకపోవడంతో మస్క్ వైట్‌హౌస్‌ను వదిలివెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌తో విభేదాల తర్వాత మొదటిసారిగా మస్క్ మళ్లీ వైట్‌హౌస్‌ను సందర్శించి విందులో పాల్గొన్నారు.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దాదాపు ఏడు సంవత్సరాల తరువాత అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా, ట్రంప్ ఆయన గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ఎలాన్ మస్క్ కూడా ఆహ్వానితులయ్యారు. మస్క్‌తో పాటు పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ విందులో మస్క్ హాజరు కావడం, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తగ్గుతున్నాయా? అన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి