Breaking News

నయనతార బర్త్‌డే గిఫ్ట్.. రూ.10 కోట్ల లగ్జరీ కారు


Published on: 20 Nov 2025 12:05  IST

అగ్ర హీరోయిన్‌ నయనతార (Nayanthara) తన 41వ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 18వ తేదీన జరుపుకోగా, ఈ సందర్భంగా ఆమె భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ (Vignesh Shivan) ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ స్పెక్టర్ (Rollsroyce Black Badge Spectre) ను నయనకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చి విషెస్‌ చెప్పారు. నయనతారకు పలువురు సినీ ప్రముఖులు, సహచర నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి