Breaking News

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 


Published on: 20 Nov 2025 17:10  IST

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

తుపాను కారణంగా ధాన్యం తడిసిపోకుండా రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా 3,000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, రవాణాకు వేలాది వాహనాలను సిద్ధం చేశామని, ధాన్యాన్ని ఆకాల వర్షాల నుండి రక్షించడానికి టార్పాలిన్లను  రైతులకు ఉచితంగా అందించామని తెలిపారు.ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని, ఇప్పటికే రూ. 560 కోట్లకు పైగా చెల్లించినట్లు మంత్రి తెలిపారు.రైతులు తమ ధాన్యం అమ్మకాలను షెడ్యూల్ చేసుకోవడానికి 7337359375 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 

Follow us on , &

ఇవీ చదవండి