Breaking News

రికార్డు స్థాయిలో కోకాపేట ప్లాట్లు..ఎకరం రూ.137.25 కోట్లు


Published on: 24 Nov 2025 18:03  IST

కోకాపేటలో నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. HMDA అధికారులు ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వేలం నిర్వహించారు. వివరాల ప్రకారం, ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి రూ.137.25 కోట్లు పలికింది.కోకాపేట్‌లో మిగిలిన భూములను ఈ నెల 28వ తేదీన HMDA అధికారులు వేలం వేయనున్నారని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి