Breaking News

జాతీయ రహదారి 167 పై ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండలం పిల్లిగుండ్ల వద్ద జాతీయ రహదారి 167 పై బుధవారం (నవంబర్ 26) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 


Published on: 27 Nov 2025 10:27  IST

మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండలం పిల్లిగుండ్ల వద్ద జాతీయ రహదారి 167పై బుధవారం (నవంబర్ 26) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు

ప్రమాద కారణం ఇనుప షీట్లు లోడ్ చేసిన లారీ, ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఢీకొట్టిన వెంటనే ఇథనాల్ ట్యాంకర్ మంటలు చెలరేగి, భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌కు మంటలు చెలరేగాయి, దీంతో ట్యాంకర్ డ్రైవర్ కాలి బూడిదైపోయాడు.ట్యాంకర్ డ్రైవర్ మరణించగా, లారీ డ్రైవర్‌ను స్థానికులు రక్షించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పడానికి సుమారు మూడు గంటల పాటు శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకర్ అతివేగంగా ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి ధరావత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి