Breaking News

మళ్లీ తుఫాన్.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ


Published on: 27 Nov 2025 17:20  IST

శ్రీలంకను అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. ఈ మేరకు విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఉన్నతాధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. ఈ తుఫాన్‌కు దిత్వాగా అని యమెన్ పేరు పెట్టిందని తెలిపారు. ఈ తుఫాన్ కారణంగా రానున్న వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి