Breaking News

శ్రీ వేంకటేశ్వర ఆలయ అభివృద్ధికి భూమిపూజ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు (నవంబర్ 27, 2025) అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. 

Published on: 27 Nov 2025 18:58  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు (నవంబర్ 27, 2025) అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ మరియు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. 

ఈ ఆలయ విస్తరణ పనులు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సహకారంతో రెండు దశల్లో, మొత్తం ₹260 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. మొదటి దశలో ప్రాకారం, ఏడు అంతస్తుల మహారాజగోపురం, అర్జిత సేవా మండపం, పుష్కరిణి వంటి పనులు ఉంటాయి.రెండవ దశలో మాడ వీధులు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికుల నివాస సముదాయాలు మరియు ఉద్యోగుల నివాస గృహాలు నిర్మించబడతాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమరావతిని దేవతల రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములను అందించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి