Breaking News

లీజు భూములకు కన్వర్షన్ అవకాశం లేదు

ఫ్రీహోల్డ్ భూములు కలిగిన యజమానులు మాత్రమే కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, లీజు భూములకు ఈ అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.


Published on: 01 Dec 2025 18:17  IST

ఫ్రీహోల్డ్ భూములు కలిగిన యజమానులు మాత్రమే కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, లీజు భూములకు ఈ అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం (HILTP) 2025పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. 

ఎవరికైతే భూమిపై యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఉన్నాయో, వారు మాత్రమే ఈ పథకం కింద కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.ప్రస్తుత విధానం ప్రకారం లీజుకు తీసుకున్న భూములను కన్వర్షన్ చేసే అవకాశం లేదు.లీజు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 2023 ఆగస్టులో జీవోలు (GO Ms. 19, 20, 21) జారీ చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు.ప్రభుత్వం వసూలు చేసేది భూమి విలువ కాదని, అది కేవలం కన్వర్షన్ ఫీజు (30% నుండి 50% వరకు) మాత్రమేనని ఆయన వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి