Breaking News

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు (ఓడీసీ) మండలంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు సిమెంట్ లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

Published on: 03 Dec 2025 13:08  IST

శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు (ఓడీసీ) మండలంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు సిమెంట్ లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఓబుళదేవరచెరువు మండలం, సుందరయ్య కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.రెండు సిమెంట్ లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి.డ్రైవర్లు మోసిన్, గంగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న స్థానిక యువకులు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మోసిన్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు.గాయపడిన ఇద్దరు డ్రైవర్లను 108 అంబులెన్స్‌లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి