Breaking News

యాసిడ్ దాడి కేసుల‌పై సుప్రీంకోర్టు షాక్


Published on: 04 Dec 2025 17:21  IST

యాసిడ్ దాడి కేసుల‌పై సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ వ్య‌క్తం చేసింది. దేశ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల‌ పెండింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని అన్ని హైకోర్టుల‌కు సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశం జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఆ స‌మాచారాన్ని ఇవ్వాల‌ని చెప్పింది. ఢిల్లీలో రోహిణి కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ యాసిడ్ దాడి కేసును సుప్రీం విచారిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. 16 ఏళ్లుగా యాసిడ్ దాడి కేసులో విచార‌ణ జ‌ర‌గ‌డం సిగ్గుచేటు అని ధ‌ర్మాస‌నం చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి