Breaking News

మంగళగిరి మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర

దుష్ప్రచారం చేయడం జగన్‌కు అలవాటు అని ఆంధ్రప్రదేశ్  మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.


Published on: 04 Dec 2025 18:15  IST

దుష్ప్రచారం చేయడం జగన్‌కు అలవాటు అని ఆంధ్రప్రదేశ్  మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) వ్యాఖ్యానించారు. ఈరోజు మంగళగిరిలో మీడియా సమావేశంలో ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 
ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాస్తవాలను తెలుసుకోకుండా, అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ద్వారా జగన్ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు.తప్పుడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గత ఐదేళ్ల అరాచక పాలనను భరించలేకే ప్రజలు వైఎస్సార్‌సీపీని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి