Breaking News

రూ.60 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ..


Published on: 04 Dec 2025 18:32  IST

బ్యాంకు లోన్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బురిడీ కొట్టించారు. ప్రాసెసింగ్ ఫీజు పేరిట లక్షల్లో వసూలు చేసి, లోన్లు ఇప్పించకుండానే బొర్డు తిప్పేశారు. డబ్బులు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్​లోని ఎస్ఆర్ నగర్ కేంద్రంగా ఈ చీటింగ్ జరిగింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి లోన్లు రాక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్​లోని ఓ ప్రైవేట్ సంస్థ టార్గెట్ చేసింది. ఒక్కో ఉద్యోగి నుంచి  రూ.1.70 లక్షలదాకా గుంజారు. 

Follow us on , &

ఇవీ చదవండి