Breaking News

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం


Published on: 05 Dec 2025 11:00  IST

బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి