Breaking News

హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య భేటీ

హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య భేటీ జరుగుతోంది. డిసెంబర్ 5, 2025న జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా వారు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. 

Published on: 05 Dec 2025 12:36  IST

హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య భేటీ జరుగుతోంది. డిసెంబర్ 5, 2025న జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా వారు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. 

న్యూఢిల్లీలోని చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఈ రోజు (డిసెంబర్ 5, 2025) ఉదయం ప్రధాని మోదీ ఆయన్ను హైదరాబాద్ హౌస్‌కు సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితమే ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి.రక్షణ, ఇంధనం, అంతరిక్షం, వాణిజ్యం వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరుగుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.భారత్ తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని మోదీ పుతిన్‌తో అన్నట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి