Breaking News

చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు..


Published on: 08 Dec 2025 14:38  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.ఈ మేరకు సీఎం దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు అధికార వర్గాలు. ఇవాళ(సోమవారం)దావోస్‌ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి