Breaking News

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ₹827 కోట్లు రీఫండ్‌ చేసింది

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ₹827 కోట్లు రీఫండ్‌ చేసినట్లు సోమవారం (డిసెంబర్ 8, 2025) ప్రకటించింది.


Published on: 08 Dec 2025 17:19  IST

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ₹827 కోట్లు రీఫండ్‌ చేసినట్లు సోమవారం (డిసెంబర్ 8, 2025) ప్రకటించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం ఈ రీఫండ్‌లు నవంబర్ 21 నుండి డిసెంబర్ 7, 2025 మధ్య రద్దయిన మొత్తం 9,55,591 టిక్కెట్‌లకు సంబంధించినవి. 

డిసెంబర్ 8, 2025 నాటికి, ఇండిగో ప్రయాణికులకు సుమారు ₹827 కోట్లు రీఫండ్ చేసింది.డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వం, ప్రభావితమైన ప్రయాణికులందరికీ డిసెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల లోపు టిక్కెట్ డబ్బులు రీఫండ్ చేయాలని, సామాను కూడా తిరిగి ఇవ్వాలని సంస్థను ఆదేశించింది.ఇండిగో విమానయాన సంస్థ, విమానాలు రద్దయిన ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బులను ఆటోమేటిక్‌గా వారి అసలు చెల్లింపు పద్ధతిలోనే (original mode of payment) తిరిగి జమ చేస్తున్నట్లు తెలిపింది.డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 15 వరకు ప్రయాణించవలసిన టిక్కెట్ల రద్దు లేదా రీషెడ్యూలింగ్ ఛార్జీలపై పూర్తి మినహాయింపును ప్రకటించింది.ప్రయాణికుల నుండి వేరు చేయబడిన సుమారు 9,000 బ్యాగేజీలలో 4,500 బ్యాగులు తిరిగి అందించబడ్డాయి. మిగిలినవి త్వరలో పంపిణీ చేయబడతాయి.సోమవారం (డిసెంబర్ 8, 2025) కూడా సుమారు 500 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 10 నాటికి కార్యకలాపాలు స్థిరీకరించబడతాయని ఇండిగో భావిస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి