Breaking News

పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల..


Published on: 09 Dec 2025 18:46  IST

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం (డిసెంబర్ 9) విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు ఎక్కువ గ్యాప్ వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి