Breaking News

మద్యం కేసులో సీజ్‌ చేసిన కార్లపై 16న తీర్పు


Published on: 10 Dec 2025 12:33  IST

మద్యం కుంభకోణంలో ప్రధా న నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు సిట్‌ అధికారులు సీజ్‌ చేసిన కారుల విడుదలపై విజయవాడ ఏసీబీ కోర్టు 16న తీర్పు ఇవ్వనుంది. సిట్‌ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు రెండు కారులను సీజ్‌ చేసింది. ఆ కారులు తమ కంపెనీకి చెందినవని ఇస్పాత్‌ కంపెనీ కొద్దిరోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వాటిని విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. దీనిపై మంగళవారం వాదనలు ముగిశాయి.

Follow us on , &

ఇవీ చదవండి