Breaking News

అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్


Published on: 10 Dec 2025 13:59  IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇటీవల వరసగా రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఇవాళ (బుధవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని వివరించారు. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలతో ఫేక్ కాల్స్, మెయిల్స్‌పై కో ఆర్డినేట్ చేసుకుంటున్నామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి