Breaking News

ఆర్టీసీని మరింత విస్తరిస్తాం..


Published on: 11 Dec 2025 12:57  IST

రాజధాని నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అన్నారు. రాణిగంజ్‌ డిపోలో 65 ఎలక్ర్టిక్‌ బస్సులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేయర్‌ విజయలక్ష్మితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ర్టిక్‌ బస్సుల వినియోగాన్ని తెలంగాణ ఆర్టీసీ విస్తృతం చేస్తోందన్నారు. గ్రేటర్‌(Greater)లో 373 కొత్త కాలనీ రూట్లలో ఆర్టీసీ బస్సులు ప్రారంభించిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి