Breaking News

మార్చి నాటికి భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌..!


Published on: 11 Dec 2025 16:53  IST

భారత్‌- అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతోన్న వేళ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు (India-USA Trade Deal). మార్చి నాటికి ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పలు అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయం సాధిస్తున్నారని చెప్పారు.అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్‌ స్విట్జర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ప్రస్తుతం జరుగుతోన్న వాణిజ్య చర్చల్లో పాల్గొంటోంది.

Follow us on , &

ఇవీ చదవండి