Breaking News

సూర్యకుమార్‌ యాదవ్‌కు అసలు ఏమైంది?


Published on: 11 Dec 2025 16:59  IST

సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వస్తే.. ప్రత్యర్థులకు ముఖ్యంగా బౌలర్లకు ముచ్చెమటలే. ఎంత మంచి బంతిని సంధించినా.. దాన్ని బౌండరీకి తరలించడం స్కై హాబీ. కానీ కొంతకాలంగా అతడి బ్యాటింగ్‌లో మెరుపు తగ్గుతోంది. ఇన్నింగ్స్‌లు గాడి తప్పుతున్నాయి. గత 19 టీ20 ఇన్నింగ్స్‌లో అతడు కేవలం 222 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌ రేట్‌ కూడా 120కి పడిపోయింది. ఓవరాల్‌గా అతడి కెరీర్‌ స్ట్రైక్‌రేట్‌ 164.05గా ఉండటం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి