Breaking News

బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి


Published on: 12 Dec 2025 10:50  IST

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

Follow us on , &

ఇవీ చదవండి