Breaking News

పత్తి కొనుగోళ్లపై దెబ్బ


Published on: 12 Dec 2025 11:02  IST

గత ఏడాది వేలాది సంఖ్యలో పత్తి బేళ్లను అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలపై సీఐడీ చేపట్టిన విచారణ.. సీసీఐ లో పరిస్థితులను మరింత గందరగోళంగా మార్చింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలోని సీసీఐ కేంద్రాల్లో నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు ప్రక్రియ సరిగా జరగడం లేదని ఇప్పటికే నివేదికలు వచ్చాయి. సీఐడీ విచారణ నేపథ్యంలో గత ఏడాది సీసీటీవీ ఫుటేజ్‌ తీసుకురావాలని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన మిలర్లకు సీసీఐ జనరల్‌ మేనేజర్‌ నోటీసులు జారీచేయడం కలకలం రేపుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి