Breaking News

బాపట్ల జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. భార్యను హత్య చేసిన భర్త, ఆమె మృతదేహాన్ని బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయాడు.


Published on: 15 Dec 2025 10:28  IST

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. భార్యను హత్య చేసిన భర్త, ఆమె మృతదేహాన్ని బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.అల్లడి వెంకటేశ్వర్లు (30) అతని భార్య మహాలక్ష్మి (28) దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు, మనస్పర్థలు ఉండటంతో మహాలక్ష్మి భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు ఆమెను అనుమానంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.ఆదివారం (డిసెంబర్ 14, 2025) ఉదయం వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి, బంగారం ఇప్పిస్తానని నమ్మించి మహాలక్ష్మిని గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగి, గొంతు నులిమి హత్య చేశాడు.హత్య అనంతరం, వెంకటేశ్వర్లు మృతదేహాన్ని తన మోటార్‌సైకిల్‌పై ఉంచి నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యులు మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి