Breaking News

మూడు దేశాల పర్యటన..బయల్దేరిన ప్రధాని మోదీ


Published on: 15 Dec 2025 12:39  IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సోమవారం) మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. వెస్ట్ ఆసియా, ఆఫ్రికాలలో కీలక భాగస్వామ్యులైన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవటంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్‌లోని హషెమెట్ కింగ్‌డమ్ వెళతారు. అమన్ పర్యటనలో భాగంగా కింగ్ అబ్దుల్లా 2 ఐబిన్ అల్ హుస్సేన్, ప్రధాన మంత్రి జఫార్ హాసన్, యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా 2తో సమావేశం కానున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి