Breaking News

భాగ్యనగరంలో భారీ అగ్ని ప్రమాదం..


Published on: 18 Dec 2025 15:03  IST

లింగంపల్లిలో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నిర్మాణ సంస్థకు చెందిన కూలీలు ఏర్పాటు చేసుకున్న షెడ్‌లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనను గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు.సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి