Breaking News

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు


Published on: 18 Dec 2025 18:46  IST

మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి