Breaking News

శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు


Published on: 19 Dec 2025 13:00  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన పరిధిలో భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా రీల్స్ చేసిన యువతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నిబంధనలకు విరుద్దంగా రీల్స్ చేసిన వీడియో వైరల్‌పై యువతి స్పందించింది. తాను దేవాలయంలో డ్యాన్స్ చేయలేదని, ఒకవేళ తప్పు చేసి ఉంటే క్షమించాలని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇన్‌ స్టాలో, యూట్యూబ్‌లలో ఓ వీడియో ట్రోల్ అవుతున్నదని.. అది తనదే అని చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి