Breaking News

95వ ఏట సర్పంచ్‌గా ఎన్నిక..


Published on: 23 Dec 2025 18:43  IST

ఏడెనిమిది దశాబ్దాలపాటు ఆయన నిస్వార్థంగా తన గ్రామ ప్రజలందరికీ సేవలందించారు. తలలో నాలుకలాగా ఉంటూ ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా.. చేతనైన సాయం అందించారు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఎన్నడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ ఈసారి గ్రామ ప్రజలంతా మూకుమ్మడిగా బలవంతం చేయడంతో తన 95వ ఏట సర్పంచ్‌గా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆయనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల కేంద్రం సర్పంచ్‌ గుంటకండ్ల రామచంద్రారెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి