Breaking News

హైకోర్టులో ఘనంగా సెమీ క్రిస్మస్‌


Published on: 24 Dec 2025 11:31  IST

హైకోర్టులో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం హైకోర్టు అడ్వొకేట్‌ అసోసియేషన్‌ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రఘువీర్‌, ప్రధాన కార్యదర్శి సుబోధ్‌, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి