Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారుల కుట్ర బయటపెట్టాలి


Published on: 24 Dec 2025 11:49  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారుల కుట్రను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ కేసీఆర్‌, కేటీఆర్‌కు నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా? అన్నది అనుమానమే.

Follow us on , &

ఇవీ చదవండి