Breaking News

లిఫ్ట్ ప్రమాదంలో వృద్ధురాలు మృతి

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో సోమవారం (డిసెంబర్ 30, 2024) ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోవడంతో 75 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే మరణించారు.

Published on: 30 Dec 2025 12:58  IST

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో సోమవారం (డిసెంబర్ 30, 2024) ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోవడంతో 75 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే మరణించారు.

కమలమ్మ (75) సన్‌సిటీ, బండ్లగూడ జాగీర్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్.ప్రాథమిక సమాచారం ప్రకారం, లిఫ్ట్ డోర్ తెరిచి ఉండటంతో అది అక్కడే ఉందని భావించిన ఆమె లోపలికి అడుగు పెట్టారు. అయితే అప్పటికే లిఫ్ట్ కేజ్ వేరే అంతస్తులో ఉండటంతో, ఆమె నేరుగా నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయారు.తీవ్ర గాయాలవడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు.ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement