Breaking News

పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం...


Published on: 12 May 2025 15:23  IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు. పాక్‌లో సామాన్య పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. పాక్ వైపు నుంచి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని ఆయన పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి