Breaking News

రేపు మత్స్యకార సమాఖ్య ఎన్నికలు


Published on: 06 Jan 2026 14:20  IST

రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు బుధవారం విజయవాడలోని ఆప్కాఫ్‌ కార్యాల యంలో జరగనున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌ నాయక్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సమాఖ్య చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు అదే రోజు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, అవసరమైతే పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,136 మత్స్యకార సహకార సంఘాలున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి